విదేశీ ఉద్యోగాల కల్పనలో చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర యువతకు నైపుణ్యంతో పాటు ఫారిన్ లాంగ్వేజ్‌లపై శిక్షణ ఇస్తూ విదేశాల్లో గ్లోబల్ ఉద్యోగాలను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోంది. ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ఆధ్వర్యంలో జపాన్, జర్మనీ, కువైట్ తదితర దేశాలకు యువతను పంపిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, కడప సహా ఆరు ప్రాంతాల్లో ఆయా దేశాల సంస్కృతి, చట్టాలపై అవగాహన కల్పిస్తూ, నర్సింగ్ మరియు ఐటీఐ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ భారీ వేతనాలతో విదేశీ అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు చేపడుతున్నారు.