సంప్రదాయ వేడుకల సందడి: చౌటుప్పల్ జేబీఎం కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జేబీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వేడుకల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు.కార్యక్రమం ప్రిన్సిపాల్, కరెస్పాండంట్ గంగాపురం జంగయ్య, నిర్మల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు