గాంధీ జయంతి వేడుకలు: పార్వతీపురంలో మహాత్మా విగ్రహానికి బోనాల విజయ్ నివాళి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: పార్వతీపురం మన్యం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్వతీపురం నాలుగు రోడ్ల కూడలిలోని ఆయన విగ్రహానికి స్థానిక నేత బోనాల విజయ్ పార్వతీపురం నివాళులర్పించారు. సత్యం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్ రెండును ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తిస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అనంతరం కొత్తవలస దుర్గగుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బోనాల విజయ్ పార్వతీపురం వెల్లడించారు.