పాతకోటలో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్

రిపోర్టర్: Thrinadh Rudi స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం పాతకోట గ్రామంలో శరన్నవరాత్రుల సందర్భంగా మాజీ సర్పంచ్ పెల్లమల రామలింగం గ్రామస్తులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అలాగే పలువురు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.