ఆస్ట్రేలియా-ఏ జట్టుపై 162 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇండియా-ఏ

రిపోర్టర్: విజయ్ స్థలం: పుదుచ్చేరి

ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు 162 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. పుదుచ్చేరి సీఏపీ-సీచెమ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షామ్స్ ములానీ మొత్తం ఏడు వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకే ఆలౌట్ అయింది. అన్షుల్ కాంబోజ్ తొలి సెషన్లో కీలక వికెట్లు పడగొట్టగా, కుమార కుషాగ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.