గోవా కోర్టులో లొంగిపోయిన తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్

రిపోర్టర్: అశోక్ స్థలం: గోవా

లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు పదేళ్ల శిక్ష విధించడంతో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ గోవా కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయన్ను ఉత్తర గోవా సెంట్రల్ జైలుకు తరలించారు. లొంగుబాటు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.