'దేశం కోసం ఆశీర్వాద దీపం వెలిగిద్దాం': మోదీ జన్మదినంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రజలంతా 'ఆశీర్వాద దీపం' వెలిగించి కృతజ్ఞతలు తెలియజేయాలని బీజేపీ జాతీయ పార్టీ విభాగాల సమన్వయకర్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ పాలనను, దేశాభివృద్ధిని కొనియాడుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.