పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక పఠనంపై పిటిషన్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా పఠించాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ స్వీకరణకు నిరాకరించింది. ఆరో తరగతిలో ఇప్పటికే పీఠికను బోధిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం కింద దాఖలైన ఈ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.