కిన్నెరసాని జలాశయానికి పోటెత్తిన వరద ప్రవాహం!
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి 8,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుతం 403.50 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.