బీజేపీ పగటి కలలపై నిప్పులు చెరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పరిపాలన, కేంద్రంలోని బీజేపీ తీరు ప్రజలను వంచించడమేనన్నారు. ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగటి కలలు కంటున్న ఆ పార్టీలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని పొంగులేటి హెచ్చరించారు.