బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆదివారం ఆలయ ధర్మకర్త, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలయ అధికారులు, అర్చక స్వాములు, గ్రామ పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, భక్తుల రాకపోకలు, తాగు నీరు, విద్యుత్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.