కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అనాటి చీకటి రోజులను తిరిగి తెచ్చిందని బీఆర్ఎస్ మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత కరెంటు కోతలతో పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్ కూడా చీకట్లోకి నెట్టివేయబడిందని విమర్శించింది. కరెంటు కోతల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన పడుతున్నారని, వ్యాపారుల ఉపాధి దెబ్బతిని రోడ్డున పడుతున్నారని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.