దులీప్ ట్రోఫీ ఫైనల్: కష్టాల్లో సౌత్ జోన్ జట్టు

రిపోర్టర్: సతీష్ స్థలం: India

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌత్ జోన్ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. పేసర్ మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీసి సౌత్ జోన్‌ను దెబ్బతీశాడు. కెప్టెన్ తిలక్ వర్మ 56 పరుగులతో క్రీజులో ఉండగా, జట్టు ఇంకా భారీ వెనుకంజలో ఉంది.