నారాయణపేటలో ఎత్తిపోతల కెనాల్ పనులు అడ్డుకున్న రైతులు, బీఆర్ఎస్ నేతలు
రిపోర్టర్: విజయ్
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దంతంపల్లి శివారులో రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను బాధిత రైతులు తీవ్రంగా అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పూర్తిస్థాయి నష్టపరిహారం అందకుండానే పనులను ఎలా ముందుకు తీసుకువెళతారని వారు అధికారులను నిలదీశారు. ఈ ఆందోళనకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.