ఎన్టీఆర్ జిల్లాలో మహిళ దారుణ హత్య మరియు మొండెం లభ్యం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ముప్పై ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేశారు. ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వద్ద తల, చేతులు లేని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకే నిందితులు తల, శరీర భాగాలను వేరు చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.