తిమ్మాపూర్లో ఎస్సారెస్పీ భూముల్లో భారీ వృక్షాల నరికివేత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మానేరు జలాశయం పరివాహక ప్రాంతంలోని ఎస్సారెస్పీ స్థలాల్లో దశాబ్దాల క్రితం నాటిన భారీ వృక్షాలను అక్రమార్కులు రాత్రికి రాత్రే నరికి సామిల్లులకు తరలిస్తున్నారు. అధికారుల ఉదాసీనత, కొందరి సిబ్బంది చేతివాటం వల్లే రూ. లక్షల విలువైన ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతోంది. రామకృష్ణ కాలనీ శివారులో కలప తరలిస్తున్న ట్రాక్టర్ను గ్రామస్తులు పట్టుకుని నిలదీశారు.