చేబ్రోలులో వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధిస్తాం: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
చేబ్రోలు మండలంలో అన్ని ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలను వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఘనంగా గెలుచుకుంటామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. చేబ్రోలులో జరిగిన కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థుల విజయానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు.