రాష్ట్రంలో ఉత్కంఠగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, దాదాపు 99.36 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 10,262 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఈ నెల మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.