మైసూర్ లో ఆటోలో వచ్చి ధర్మన్ షూటింగ్ లో పాల్గొన్న రజనీకాంత్

రిపోర్టర్: గోపి స్థలం: Mysuru

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రస్తుతం మైసూర్ లో జరుగుతున్న ధర్మన్ సినిమా షూటింగ్ కు లగ్జరీ కార్లను పక్కనపెట్టి సాధారణ ఆటోలో వచ్చారని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. సెట్ కు తలైవా సింపుల్ గా రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆటో దిగి అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన లోపలికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.