లక్సెట్టిపేట మండలంలో ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ ఇల్లు ధ్వంసం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
లక్సెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో అధికార పార్టీకి చెందిన ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంట్లోని వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు టీవీతో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.