మహారాష్ట్రలో వంద ఎకరాల్ లో అనాథలు, వృద్ధుల కోసం భారీ సంక్షేమ ప్రాజెక్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: Maharashtra

మహారాష్ట్ర లోని కర్జాత్ లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఐదు వేల మంది అనాథలు, వృద్ధులు అలాగే దివ్యాంగుల కోసం 'నీతా ముకేష్ అంబానీ అనంత ఆశ్రయ్' కేర్ టౌన్షిప్ నిర్మాణానికి రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ శంకుస్థాపన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా నిరాశ్రయులకు శాశ్వత గృహాలు, అత్యాధునిక వైద్య సేవలు, పునరావాస కేంద్రాలు అలాగే ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.