గోల్మాల్-5 షూటింగ్ పూర్తి చేసిన నటుడు శర్మన్ జోషి
రిపోర్టర్: విజయ్
స్థలం: India
రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న 'గోల్మాల్-5' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంతో శర్మన్ జోషి మళ్లీ ఈ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతున్నారు. అజయ్ దేవగన్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అవకాశమని, ఈ ప్రయాణాన్ని తాను ఎంతో ఆస్వాదించానని శర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ తదితరులు నటిస్తున్నారు.