మహిళలకు పెద్దన్నగా నిలిచిన సీఎం చంద్రబాబుంటూ పూసపాటి అదితి ప్రశంస
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం ప్రాంతానికి చెందిన పూసపాటి అదితి తాజా సామాజిక మాధ్యమ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాలపై హర్షం వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల నిరీక్షణ తర్వాత పేదలకు అందిన ఇంటి పట్టాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయని ఆమె తెలిపారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ మహిళలకు పెద్దన్నగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి ద్వారా వ్యవస్థలను సమూలంగా మారుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.