మృతుని కుటుంబానికి ఆసరా: ఆటో యూనియన్ రూ.10 వేల ఆర్థిక సాయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చెన్నారావుపేట
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతిచెందిన ఆటో డ్రైవర్ బొంత సురేష్ కుటుంబాన్ని శనివారం ఆటో యూనియన్ నాయకులు పరామర్శించారు. సురేష్ దశదిన కార్యక్రమానికి హాజరైన యూనియన్ అధ్యక్షులు సిద్ద ఉపేందర్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కరెడ్ల శివ, ముఖ్య సలహాదారులు ఎండీ పాషా తదితరులు పాల్గొని తమ సానుభూతిని తెలిపారు.