రాజాపేటలో మాదిగలకు రాజ్యాధికారమే లక్ష్యమన్న కందుల రామన్ మాదిగ
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుల రామన్ మాదిగ పాల్గొని మాట్లాడారు. మాదిగలకు రాజ్యాధికారమే ముందున్న లక్ష్యమని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజాపేట మండల ఇన్చార్జిగా దగ్గుల విష్ణును నియమించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.