మధ్యప్రదేశ్ లో ఎస్హెచ్ఓ హత్య కేసు: వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Dewas
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో పోలీసు ఇన్స్పెక్టర్ను లారీతో తొక్ కి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులు వేర్వేరు ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారని పోలీసు అధికారులు వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాను అడ్డుకునే క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఎస్హెచ్ఓ దిలీప్ పూరి ప్రాణాలు కోల్పోయారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు గజేంద్రతో పాటు మరో నిందితుడు ధీరజ్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి, కాల్పులకు పాల్పడటంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు ఎస్పీ ఆదిత్య మిశ్రా స్పష్టం చేశారు.