శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
శాప్ కార్యాలయం వద్ద క్రీడా కోటా ఉపాధ్యాయులపై దాడి చేసి అల్లర్లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో జరిగిన ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆమె, వైకాపా నేతలు రౌడీషీటర్లతో దాడి చేయించారని మండిపడ్డారు. ఈ దాడిని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రామకృష్ణతో పాటు వివిధ జేఏసీల నాయకులు తీవ్రంగా ఖండించారు.