తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిన ఉల్లిపాయల ధరలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా కొండెక్కడంతో సామాన్యుల బడ్జెట్ తల్లకిందులవుతోంది. కొద్ది రోజుల క్రితం రూ.20-30 మధ్య ఉన్న కిలో ఉల్లి ధర, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. సరఫరా లేకపోవడం, పంట దిగుబడి తగ్గడం వంటి కారణాలతో ధరలు భారీగా పెరిగాయని, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.