శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: కౌంటింగ్ కు మూడంచెల భద్రత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇచ్చాపురం మరియు పలాస మున్సిపాలిటీల పరిధిలో పురపాలక ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన పోలీసు భద్రతా నడుమ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ కోసం మూడంచెల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టడం గమనార్హం.