పాఠశాలల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ: సీబీఎస్ఈ కీలక ఆదేశాలు జారీ
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల అవగాహన పెంచేందుకు అక్టోబర్ 7న ముప్పై నిమిషాల శిక్షణా మాడ్యూల్‌ను ప్రదర్శించాలని అనుబంధ పాఠశాలలను సీబీఎస్ఈ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల సిబ్బందిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది గరిష్ట సంఖ్యలో హాజరుకావాలని విద్యాశాఖ సూచించింది.