వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బండి సంజయ్‌కు వినతి
రిపోర్టర్: మహేష్
స్థలం: కరీంనగర్
వావిలాల ఖాదీ ప్రతిష్ఠాన్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కోరినట్లు కార్మికులు తెలిపారు. కరీంనగర్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. మూడు నెలల వేతనాల చెల్లింపు, గ్రాట్యుటీ అందజేతతో పాటు సంస్థ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు చెప్పారు. చైర్మన్ సురభి వాణి దేవితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు కార్మికులు వెల్లడించారు.