ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తొలగింపునకు సీపీఎం నేతల డిమాండ్
రిపోర్టర్: శివ
స్థలం: శ్రీకాకుళం
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని పాలకుల కనుసన్నలలోనే కోట్ల సంఖ్యలో ఓటర్లను తొలగించారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.