అనకాపల్లి అభివృద్ధికి రూ.349.03 కోట్ల SASCI నిధులు మంజూరు

రిపోర్టర్: విజయ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఎస్ఏఎస్‌సీఐ కింద రూ.349.03 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. దీనివల్ల తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు విద్యారంగంలోనూ సదుపాయాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.