యలహంక ప్యాలెస్ మా బిడ్డల హక్కు: ఏపీసీసి అధ్యక్షురాలు షర్మిల స్పష్టీకరణ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
బెంగళూరులోని యలహంక ప్యాలెస్ తన పిల్లల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తన కుమార్తె అంజలి వివాహం ఆ ఇంట్లోనే జరగాలని కోరుకున్నప్పటికీ, వివాదాల నేపథ్యంలో వేరే చోట నిర్వహించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకాల్లో ఆ ఇల్లు తనకు, తన పిల్లలకు దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదని, దేవుడి సాక్షిగా ఇదే నిజమని ఆమె ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.