నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్ఎస్సి 2026 పరీక్షల క్యాలెండర్ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. జూనియర్ ఇంజనీర్, ఢిల్లీ పోలీస్ ఎస్ఐ మరియు సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా షెడ్యూల్ను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కమిషన్ సూచించింది.