గులాబీ గూటికి చేరుకున్న శేరిలింగంపల్లి యువనేత రామప్రభు

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మియాపూర్ పరిధిలో సేవాపథం నుంచి రాజకీయ పోరుబాట వైపు అడుగులు వేస్తూ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామప్రభు తన బృందంతో కలిసి పార్టీ మారారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఆయనకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం కాకుండా ప్రజా గొంతుకై పనిచేసేందుకే తాను గులాబీ జెండా పట్టానని స్పష్టం చేశారు.