పొదలకూరులో రియల్ దందాతో భగ్నమైన త్రిమూర్తుల స్నేహబంధం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరులో ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న ప్రముఖులు ఇప్పుడు వేర్వేరు దారుల్లో పయనిస్తున్నట్లు పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మరియు స్థలాలు ఆక్రమణల నేపథ్యంలో వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం వినిపిస్తోంది. సత్యనారాయణ ట్రేడర్స్ సమీపంలోని పార్కు స్థలం మార్పు వ్యవహారం తెరపైకి రావడంతో అప్పటి పరిణామాలు, రికార్డులపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.