పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి బండ్ల గణేశ్ విజ్ఞప్తి
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై స్పందిస్తూ, ఈ రంగాన్ని ఆదుకోవాలని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మొక్కజొన్న, సోయాబీన్ ధరల పెంపును అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టాకిస్టుల అక్రమ నిల్వల వల్ల రైతులపై పడుతున్న భారాన్ని తొలగించాలని, పౌల్ట్రీ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.