భారీ డీజే శబ్దం ఆరోగ్యంతో చెలగాటం అంటూ పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
భారీ డీజే శబ్దాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు. నిషేధిత డీజే హోరు వల్ల చుట్టుపక్కల ఇళ్లలోని చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.