విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు, అప్రమత్తమైన కలెక్టర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీనితో 80 శాతానికిపైగా చెరువులు నిండిపోయాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బొండపల్లి, గజపతినగరం, రామభద్రపురంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. నగరంలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ పర్యటించి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించారు.