ఏసీబీ కోర్టు విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత కేటీఆర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు బదిలీ అయిన వ్యవహారంలో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్న నేపథ్యంలో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.