చెస్ ఒలింపియాడ్‌లో జర్మనీపై ఘన విజయం సాధించిన గుకేష్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సమర్కండ్
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్ వేదికగా జరుగుతున్న నలభై ఆరో చెస్ ఒలింపియాడ్ తొమ్మిదో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్ అద్భుత ప్రదర్శన కనబరిచారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. హోరాహోరీగా సాగిన పోరులో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ డోంచెంకోపై గుకేష్ సంచలన విజయం సాధించారు. ఓటమి అు వరకు వెళ్లిన క్లిష్టమైన స్థితి నుంచి పుంజుకుని అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేశారు. ఈ విజయంతో భారత జట్టు రెండున్నర పాయింట్లు సాధించి విజయం ఖాయం చేసుకుంది.