హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
భారీ జనసందోహం మధ్య హైదరాబాద్‌లో కొలువుదీరిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జన ఘట్టం వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయాన్నే ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన గణేశుడి శోభాయాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపే హుస్సేన్‌సాగర్ తీరానికి చేరుకుని, భక్తుల జైశ్రీరామ్ నినాదాల నడుమ మహాగణపతి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు స్పష్టం చేశారు.