గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: పశ్చిమ గోదావరి

ఉంగుటూరు మండలంలో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చేబ్రోలు, బాదంపూడి స్టేషన్లలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్లాట్‌ఫారాలపైనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.