కుప్పం బ్రాంచి కాలువకు కృష్ణా జలాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద కుప్పం బ్రాంచి కాలువకు చేరిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పసుపు కుంకుమలు, సారె సమర్పించి బీరుగానిపల్లె రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో రూ.439.64 కోట్లతో నాలుగు మండలాల్లోని 418 చెరువులను నింపుతామని, తాను తొమ్మిదోసారీ కుప్పం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.