ఇండియా కూటమిలో చేరేందుకే జగన్ ఆరాటపడుతున్నారంటూ వర్ల రామయ్య ధ్వజం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరాలని వైకాపా అధినేత జగన్ ఆరాటపడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్లీలో ఎన్డీయేకు మద్దతు ఇస్తూనే ఆంధ్రాలో వ్యతిరేకమని డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టులు పెడుతున్న జగన్ తన ముసుగు తొలగించాలని శనివారం ఎక్స్ వేదికగా ఘాటుగా డిమాండ్ చేశారు. జగన్ రహస్య మంతనాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.