జన్నారంలో బతుకమ్మ నిమజ్జన వేడుకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో బతుకమ్మ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. చెరువులు, కుంటల వద్ద నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను దగ్గరుండి గమనించాలని, నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.