షకింగ్ ఘటన: ఢిల్లీలో భారీ ఐదంతస్తుల భవనం కుప్పకూలిన వైనం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో భారీ ఐదంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరంగా నిర్వహిస్తున్నారని, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు.