జయపూర్‌లో భార్య, ముగ్గురు కూతుళ్ల దారుణ హత్య
రిపోర్టర్: సురేష్
స్థలం: రాజస్థాన్
రాజస్థాన్‌లోని జయపూర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాహుల్ అనే వ్యక్తి తన భార్య గీతా ఝా మరియు ముగ్గురు కూతుళ్లను నిద్రిస్తున్న సమయంలో రాయితో తలపై మోది కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పాల వ్యాపారి వద్ద పాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.