సంగం బ్యారేజీ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లోని వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు సంగం బ్యారేజీ వద్ద పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సోమవారం నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివరాకేష్తో కలిసి నీటి లోతు, ప్రవాహం, ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి భద్రతా చర్యలపై సమీక్షించారు. నిమజ్జనం రోజున రద్దీ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.